స్వగతం 


ఎంత బాగుంది కదా! ఆ సమాధానం వినండి ఎంతగా వీనులకు విందు కలిగిస్తుందో కదా! ఆహా కర్ణుడి జన్మ సార్ధకమైనది కదా అనిపిస్తుంది. 

Advertisements

కలలు కనే కళ్ళకి కన్నీటికి కొదవేమిటి?


కలలు కనే కళ్ళకి కన్నీటికి కొదవేమిటి? కలలు కనని కళ్ళంటూ ఉంటాయా? సారీ కలలు కనని మనసంటూ ఉంటుందా? కలలు కనేది కళ్ళా మనసా అని ఒకింత తికమకపడింది మనసు అయినా కలలు ముఖ్యం కానీ వాటిని కన్నదెవరో కాదు కదా అంతగా కలలు కనకు కన్నీళ్ళే మిగులుతాయనంటారు కలలే పెద్దగా కనలేకపోతే పెద్ద ఎత్తులు ఎలా ఎక్కగలవనీ అంటారు రెండూ నిజమే సుమా! కలలు కని వాటిని సాకారం చేసుకుంటే ఆకాశమే నీకు హద్దు కలలను … Continue reading కలలు కనే కళ్ళకి కన్నీటికి కొదవేమిటి?

రాఖీ పండుగ వచ్చేస్తున్నది. మరి రాఖీలెక్కడ దొరుకుతాయో?


దాదాపు ఒక పదేళ్ళ క్రితమనుకుంటా, ప్రత్యేకంగా రాఖీలు మాత్రమే అమ్మే షాపు కనిపించింది. బహుశా అది ఆ సంవత్సరమే ఓపెన్ చేశారనుకుంటాను. మెట్టుమెట్టుకూ ముగ్గులతో రాఖీ పండుగంతా అక్కడే ఉందా అనిపించేట్టు అందంగా ఉండింది ఆ అలంకరణ.

బోనాల ముచ్చట్లు – III


ఈరోజు బోనాల ముచ్చట్లలో బహుళ ప్రచారంలో ఉన్న ఇంకా పండుగ విధివిధానాలకు సరిగ్గా అతికినట్టుండే ఒక కథను గురించి మాట్లాడుకుందాం. కొత్తగా పెళ్ళైన అమ్మవారు ఆషాఢమాసంలో పుట్టింటికిచ్చిందట. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆషాఢమాసంలో పుట్టింటికి తీసుకొచ్చే ఆనవాయితీ మనందరికీ తెలిసిందే. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన అమ్మాయి, పెళ్ళి చేసుకుని అత్తారింటికెళ్ళి చుట్టపుచూపుగా అమ్మగారింటికి రాగానే, అకస్మాత్తుగా అపురూపమైన దేవకన్యో, దివి నుండి దిగొచ్చిన దేవతో లేక రాక రాక వచ్చిన రాజకుమారో అయిపోతుంది. అక్కడామెనెవరూ కాలుకింద మోపనివ్వరు. పంచభక్ష్య పరమాన్నాలు కొసరికొసరి తినిపిస్తారు. ఆమె కోరే కోర్కెలను పెదవులు దాటి రాకముందే తీర్చేస్తారు. ఇవన్నీ మనలో పెళ్ళైన వనితలకు అనుభవమే. ఇక అమ్మవారి గురించి చెప్పేదేముందీ, ఆమె ఇంట్లోనే కాదు ఊరంతటికీ ప్రీతిపాత్రమైనది. వరాలిచ్చే దేవత. ఇక ఆమె పుట్టింటికొస్తే మరి ఊరంతా సందడే సందడి.

బోనాల ముచ్చట్లు – II


తెలంగాణలో నిజాం కాలంనుండి జరుపుకుంటూ వస్తున్న బోనాల పండుగను రాష్ట్రప్రభుత్వం "రాష్ట్ర పండుగగా" ప్రకటించింది. ఆషాఢమాసం మొదటి ఆదివారం (15-07-2018), గోల్కొండలో జగదాంబికా అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభమయినాయి. తరవాతి ఆదివారం (29-07-2018), ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బల్కంపేట యెల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. దాని తరువాత ఆదివారం అంటే, 05-08-2018 రోజున చిలకలగూడ పెద్దమ్మ ఆలయంలో ఇంకా లాల్‌దర్వాజ మాతేశ్వరీ మందిరంలో సింహవాహిని ఉత్సవాలు ఇలా బోనాల ఉత్సవాలు నెలరోజులపాటు జరుగుతూనే ఉంటాయి.

బోనాల పాట – A Song on Bonaalu


సూర్యున్నే బొట్టుగ బెట్టినవూ బళ్ళాన్నే చేతిల బట్టినవు మహమారీ తలలే నరికినవూ, పెద్దమ్మా నరకానికి దుష్టుల దరిమినవూ కైలాసం వద్దని ఇడిసినవూ కలియుగమే మాకై వచ్చినవూ మా పిల్లల సల్లగ జూసినవూ, మాయమ్మా పులిపై సవ్వారే జేసినవూ, ఓయమ్మా అందుకె నీకు బోనాలెత్తుతమూ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ అ, డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్ ఏ..... బువ్వకుండల నైవేద్యం సుట్టు సున్నపు సింగారం..... పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటె దీపంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగా ఎత్తెను బోనం తిల్లం బిల్లం కుడుకలు బెల్లం తర్వాచన యాపకొమ్మలు చేసెను గానం తిల్లం బిల్లం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం యోవల్ల, తల్లి, డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ మాపాడి పంటలే సక్కంగ జూడు డోల్