ప్రత్యేక తెలంగాణా ప్రజాఉద్యమం

Source: Telugu gadda weekly 16th November, 1969.

అన్యరాష్ట్రాలకు మార్గదర్శకం

ప్రత్యేక తెలంగాణా ప్రజాఉద్యమం

–తాడిగిరి పోతరాజు

పది నెలలుగా తెలంగాణ గడ్డపై ప్రత్యేక తెలంగాణ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇది ప్రజాఉద్యమం కాదని, కేవలం ఆందోళన, అలజడి మాత్రమేనని బ్రహ్మానందరెడ్డి రాష్ట్రప్రజలను కేంద్రప్రభుత్వాన్ని ఇన్నాళ్ళుగా పెడదారులు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కొందరు సంఘవిద్రోహులు జరుపుతున్న గుండాయిజం అని దీనికి అసంతృప్తి చెందిన కొందరు తెలంగాణ కాంగ్రెస్ వాదులు నాయకులని కూడా ఆయన వక్రభాష్యం చెప్పుతున్నారు. పై పెచ్చు తెలంగాణ సమస్య శాంతి భద్రతల సమస్య మాత్రమేనని, రాజకీయ సమస్య కాదని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించి చివరికి విఫలుడయ్యారు. ఇప్పటికీ “పరిస్థితులు అదుపులో నున్నాయని– ప్రభుత్వం గట్టి చర్య తీసుకుంటుందని” చెప్పి తన అవివేకాన్ని, అసమర్ధతను ప్రదర్శించుకుంటున్నారు. దీనికి చెన్నారెడ్డి గాని ఇంక ఏ అసంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ్యుడుగాని నాయకుడు కాదు.

ఇది విద్యార్థుల నేతృత్వంలో నిర్వహింపబడుతున్న ప్రజా ఉద్యమం. ఇది ప్రజా ఉద్యమం కాబట్టే ఇన్ని నెలలుగా పోలీస్ కాల్పులను నిషేధపు టుత్తర్వులను, కర్ఫ్యూలను ధిక్కరించి ముందుకు పోతోంది. ఆర్ధిక అసమానత, ప్రాంతీయతత్వం, పాలక వర్గపు నియంతృత్వ ధోరణులు మొదలైన విషయాలు, గత 12 సంవత్సరాలుగ తెలంగాణ పౌరుల హృదయాలలో పెరుగుతున్న అసంతృప్తి, అసహాయస్థితి నేటి ఈ ప్రజావెల్లువకు కారణాలు.

ఆంధ్ర ప్రదేశ్ నిర్మించుకొని ఒక దశాబ్దం గడచి మరొక దషాబ్దిలో అడుగుపెట్టిన ఈ స్వల్ప కాలంలోనే తెలుగు సోదరుల ఇల్లు పగుళ్ళు చూపింది. ఇంత త్వరగా విచ్చిన్నమయిన ఈ ఐక్యతకు చారిత్రిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్తిక కారణాలు ఎన్నోఉన్నాయి. విభిన్నమైన ఈ అంశాలాను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత సంక్షోభానికి ఏ పరిష్కారమార్గం వెదకినా అది నిలువదు.  Read the rest of this entry »

ఏమిటి మీ జవాబు?

Source: Telugu gadda weekly  16 November 1969

ఏమిటి మీ జవాబు?
ఎం. సుదర్శన్ రెడ్డి, M.A.

ఆంధ్రమాత ఆంధ్రమాత అని మోతబరులు మోసం చేస్తున్నారు
ఆంధ్రమాత భాషామాత కాని దేశమాత అని యెవరన్నారు?
ప్రాంతము చీలితే భాష మారుతుందని యెవరన్నారు?
పాత్రలు మారితే పాలు నీరౌతాయని యెవరన్నారు?

“త్రత్యేక తెలంగాణకై పోరాటం సాగించండి
ప్రాణాలర్పించైనా తెలంగాణమ్ము సాధించండి”

స్వార్ధపరిపూర్ణులగు నాయకులది కాదీ సందేశం
సోదరపూర్ణులగు వినాయకులది కాదీ సందేశం Read the rest of this entry »

Follow

Get every new post delivered to your Inbox.