చెడిన తెలుగు తనం
కాళోజీ
నిజాం నవాబు పాలన క్రింద చెడిన తెలుగు తనం
గడచిన పదిహేనేండ్లలో దిద్దబడెను చాలావరకు
ఇప్పుడు తెలంగాణ అంతట ఆంధ్రత్వం ఎటుచూచిన
‘చా’, టీ అయి మసులుతాంది, ‘సడకు’ రోడ్డై సాగుతున్నది
‘అదాలతు’ ‘కోర్టా’యెను, ‘ముల్జీం’ ముద్దాయాయెను
షక్కర షుగరైపోయెను ఉప్పు సాల్టుగా మారెను
వచ్చిండని పోయిండని అంటలేడు ఎవడిప్పుడు
వచ్చాడని చచ్చాడని అంటున్నరు చచ్చినట్లు
‘పసుపుకుంకుమలు ఇప్పుడే ‘పేరంటాలావుచున్నవి
ఆంధ్రుల సంస్కృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది
రెండున్నర జిల్లాల యాసంతట వెలుస్తాంది
తెలంగాణ బంజరంత కృష్ణ నిండి పొర్లుతాంది
తెలంగాణ జంగలంత ‘గోర’ గంతులేస్తాంది
ఎంతలోన తెలంగాణ ఆంధ్రతనం నేర్చుకుంది
భావ సమైక్యత ఎంతలో అందరినీ పోనినాది
పెద్దమనిషి ఒప్పందం ఎంతలో ఫలమిచ్చినాది Read the rest of this entry »
చెడిన తెలుగు తనం
January 19, 2010 at 3:28 pm (Culture, Kaloji, Literature, Nation, People, Poetry, Society, song, Telangana, Telugu, Women)
Tags: Kaloji, Literature, People, Poetry, Society, Telangana, Telugu
నా తెలంగాణ
January 4, 2010 at 12:28 pm (Culture, Literature, People, Poetry, Society, song, Telangana, Telugu)
Tags: Culture, Literature, Palla Narendra, People, Poetry, Society, song, Telangana, Telugu
నా తెలంగాణ
నా తెలంగాణ
మమత కురిసేటి సోన
నా తెలంగాణ
ప్రేమ విరిసేటి కోన
కల్మషం ఎరుగని కష్టజీవుల సేన
వెలిసెనీ అనురాగ మూర్తి గర్భాన || నా తెలంగాణ|| Read the rest of this entry »
తెలంగాణ మాతృగీతం
December 23, 2009 at 5:51 am (Culture, Literature, People, Poetry, Society, song, Telangana, Telugu)
Tags: Ande Sree, Culture, Literature, People, Poetry, Society, song, Telangana Matrugeetam, Telugu
మాతృ గీతం
రచన – అందెశ్రీ
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ || జై…|| Read the rest of this entry »
