ఇంకెన్నాళ్ళు?

ఇంకెన్నాళ్ళు?
కాళోజీ
తెలుగుగడ్డ రెండవ సంచిక (16-09-1969) లో ముద్రితము

నవ యుగంబున నాజీవృత్తుల
నగ్ననృత్యమింకెన్నాళ్ళు?
పోలీసు అండను దౌర్జన్యాలు
పోషణబొందే దెన్నాళ్ళు?
దమననీతితో దౌర్జన్యాలకు
దాగిలిమూతలు ఎన్నాళ్ళు?
కంచెయే చేను మేయుచుండగా
కాంచకుండుటింకెన్నాళ్ళు?
దొంగలుదొంగలు ఊళ్ళుపంచుకొని
దొరలై వెలిగే దెన్నాళ్ళు?
బాధలుపెట్టి పలుకనీయని
పాపులభయ మింకెన్నాళ్ళు?
హింస పాపమని యెంచు దేశమున
హిట్లరత్వ మింకెన్నాళ్ళు? Read the rest of this entry »

ఉద్యమం ఆగబోదు

ఉద్యమం ఆగబోదు
కాళోజీ

వరమిచ్చిన కేంద్ర శివుని
శిరము పైన మోపినాడు
ముఖ్యమంత్రి భస్మాసురుడు
ముచ్చటగా తన చేతులు

మోహిని అవతారమెత్తి
సాహసించు పాటివనరు
కానరాక తల్లడిల్లు
కాడెద్దుల బలగమంత

పార్టే దేశము అనుకొను
పాటిది విజ్ఞత అంతయు
ముఠాదే రాజ్యమ్మను
శఠము గూర్చు ఫలితమ్మిది

‘పార్టీవ్రత్యము పాపము
పండిన పరిణామమిద్ది
“కాడెద్దుల” పెత్తనాల
కాలము మూడగనున్నది

‘ప్రత్యేక తెలంగాణము
ప్రాప్తి : ఒక్కటే ఒక్కటి
తెలంగాణ ప్రజలకోర్కె
తెలంగాణ ప్రత్యేకత

‘ప్రత్యేక తెలంగాణ
ప్రాప్తించే దాక ప్రజల
ఉద్యమం ఆగబోదు
ఉవ్వెత్తున లేచిసాగు

కోటిన్నర మేటిప్రజల
గొంతొక్కటి; గొడవొక్కటి
తెలంగాణ వెలసి నిలిచి
ఫలించాలె భారతాన

భారతమాతా కీ జై
తెలంగాణ జిందాబాద్


తెలుగుగడ్డ ప్రారంభ సంచిక (09-11-1969) లో ముద్రితము

తెలంగాణా ఆధునిక సాహిత్య ముఖద్వారం

తెలంగాణా ఆధునిక సాహిత్య ముఖద్వారం
శ్రీ దాశరథి
[వట్టికోట అళ్వారుస్వామి గారి 'తెలంగాణం' (1956) పుస్తకంలో ముద్రితం]

మనం జీవితంలో ఏమేం చూచామో, జీవితంలో నుంచి ఏయే అనుభవాలు పొందామో, మనందరికీ ఆసక్తిని కలిగించే ఏయే విషయాలను గూర్చి ఏమని ఆలోచించామో, వాటితో ఎట్లా ప్రభావితులమైనామో- అదంతా రికార్డు చేస్తే సాహిత్యం అవుతుంది. శబ్దాల్లో శతాబ్దాల, సహస్రాబాల పొడుగు మానవ జీవితాన్ని ప్రకటించడమే స్థూలంగా సాహిత్యం.
జీవితంతో ఇంత దగ్గరి సంబంధం గల సాహిత్యాన్ని జీవితపు మాలిన్యం అంటకుండా దూరంగా ఊహాలోకంలో స్నానమాడించి, పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించే సాహిత్యకారులు కొందరు అన్ని కాలాల్లో ఉన్నారు. వారితో మనకు ప్రమేయం లేదు. కాడలు, తీగలు, కొమ్మలు, వేళ్ళు, నేల- ఏమీ లేకుండానే వికసించే ఆకాశ కుసుమం వంటి సాహిత్యం మనకు ఉపాధేయం కాదు.
ఉదాత్తమైన సాహిత్యంలో ఆధునికమని, ప్రాచీనమని ఏమీ ఉండదు. ఇవి కేవలం కాలాన్ని నిర్ణయించుకోడానికి ఉపయోగపడే శబ్దాలు. వెనుకటి సాహిత్యాన్ని ప్రాచీనమనీ, ఈనాటి సాహిత్యాన్ని ఆధునికమనీ అనుకోవాలి. ప్రతి ఆధునికుడూ  నవ్యుడు కానక్కరలేదు. పురాతన రీతిలో వ్రాసే ఈనాటె రచయిత కూడా ఆధునికుడే. అతడు నవ్యుడు కాకపోవచ్చును. Read the rest of this entry »

చెడిన తెలుగు తనం

చెడిన తెలుగు తనం
కాళోజీ

నిజాం నవాబు పాలన క్రింద చెడిన తెలుగు తనం
గడచిన పదిహేనేండ్లలో దిద్దబడెను చాలావరకు
ఇప్పుడు తెలంగాణ అంతట ఆంధ్రత్వం ఎటుచూచిన
‘చా’, టీ అయి మసులుతాంది, ‘సడకు’ రోడ్డై సాగుతున్నది
‘అదాలతు’ ‘కోర్టా’యెను, ‘ముల్జీం’ ముద్దాయాయెను

షక్కర షుగరైపోయెను ఉప్పు సాల్టుగా మారెను
వచ్చిండని పోయిండని అంటలేడు ఎవడిప్పుడు
వచ్చాడని చచ్చాడని అంటున్నరు చచ్చినట్లు
‘పసుపుకుంకుమలు ఇప్పుడే ‘పేరంటాలావుచున్నవి
ఆంధ్రుల సంస్కృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది
రెండున్నర జిల్లాల యాసంతట వెలుస్తాంది
తెలంగాణ బంజరంత కృష్ణ నిండి పొర్లుతాంది
తెలంగాణ జంగలంత ‘గోర’ గంతులేస్తాంది
ఎంతలోన తెలంగాణ ఆంధ్రతనం నేర్చుకుంది
భావ సమైక్యత ఎంతలో అందరినీ పోనినాది
పెద్దమనిషి ఒప్పందం ఎంతలో ఫలమిచ్చినాది Read the rest of this entry »

కాళోజీ స్పూర్తితో కర్తవ్యాన్ని గుర్తిద్దాం

కాళోజీ స్పూర్తితో  కర్తవ్యాన్ని గుర్తిద్దాం
అనిత, తెలంగాణ ఉత్సవ్ కమిటీ

కన్నడులు మహారాష్ట్రులు తుర్కీ
అన్నయ్యలు తరతరాలేలినది.
గుజరాతీ, మార్వాడీ, పారిసీ
గుజ్జన గూళ్ళు అనుభవించినది
కాబూలీ ఈరాని భాయీలకు
కనువిప్పుగ వెలిగిన విధమిది.
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది.
ముంచే యత్నము చేస్తే తీరము
మునుగును తానే తీరము తప్పక (కాళోజి)

ఎవరు ఎంత కాలం పాలించినా, తెలంగాణాగడ్డ ఎన్నిరకాలుగా దోపిడీకి గురైనా,ఎన్నో సార్లు తెలంగాణా ప్రజలు దోపెడీ వ్యతిరేక ఉద్యమాలు చేసి విజయం సాధించినా మునుపెన్నడూ లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ‘మమ్మల్ని దోచుకున్నది చాలు ఇంక ఎల్లిపొండంటె, ‘మేము మిమ్మల్నొదలం మీతో కలిసే ఉంటాం, దోపిడీ ఇలానే  కొనసాగిస్తాం’ అంటూ కనీ వినీ ఎరుగని రీతిలో “అన్యాయ పోరాటం” చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్ మద్దతు పలకడం, తెలంగాణకిచ్చిన వాగ్దానాలు పదేపదే వెనక్కి తీసుకోడము పెద్దగా ఆశ్చర్యంకలిగించాల్సిన విషయం కాదు. ఎవరో దయదలచి ఉత్తపుణ్యానికి  బర్త్ డే కానుకగనైనా తెలంగాణను ఇవ్వకపోరా అనుకొంటే ఇట్లనే ఉంటది. Read the rest of this entry »

తెలంగాణ బాస

తెలంగాణ బాస
కాళోజీ

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
సుహృద్భావన ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హీహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.
‘రోడ్డని’ పలికేవారికి
‘సడకంటే’ ఏవగింపు
ఆఫీసని అఘోరిస్తూ
కచ్చేరంటే కటువు. Read the rest of this entry »

ఎవరనుకున్నారు? ఇట్లౌనని ఎవరనుకున్నారు?

ఎవరనుకున్నారు? ఇట్లౌనని ఎవరనుకున్నారు?
కాళోజీ

వరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు.

ఆంధ్ర తెలంగాణలకు ఐక్యత ఏర్పడుతుందని
హామీలిచ్చినవారే అంతా స్వాహా చేస్తారని                    || ఎవర ||

అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని
పరిపాలనతో తమ్ముల ‘ఫజీతలా పాలు చేస్తారని          || ఎవర || Read the rest of this entry »

ఆంధ్రన్నల నిర్వాకం

ఆంధ్రన్నల నిర్వాకం
కాళోజీ

నమ్ముకుని పెత్తనము ఇస్తే
నమ్మకను పోగొట్టుకుంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్నుగొడ్తివి.

పదవి అధికారములు బూని
పదిలముగ తల బోడి జేస్తివి
దాపునకు రానిస్తే చనువుగ
టోపి పెడితివి లాభపడితివి.

అన్నవై తమ్ముళ్ళ తలలను
నున్న జేస్తివి మురియబడితివి
తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి.

‘పోచంపాడూ పథకము
కూచికూచి చేసేస్తివి
‘దొంగ ముల్కీ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి. Read the rest of this entry »

తెలంగాణ సాధిద్దాం పదరా

తెలంగాణ సాధిద్దాం పదరా

కాళోజీ

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా          || పదరా || Read the rest of this entry »

వీర తెలంగాణ నాది

వీర తెలంగాణ నాది
కాళోజీ

కన్నడులు మహారాష్ట్రులు తుర్కీ
అన్నయ్యలు తరతరాలేలినది.
గుజరాతీ, మార్వాడీ, పారిసీ
గుజ్జన గూళ్ళు అనుభవించినది
కాబూలీ ఈరాని భాయీలకు
కనువిప్పుగ వెలిగిన విధమిది.
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది.
ముంచే యత్నము చేస్తే తీరము
మునుగును తానే తీరము తప్పక Read the rest of this entry »

Follow

Get every new post delivered to your Inbox.