నేటి తెలంగాణ

Anita, Telangana utsav committee

మళ్ళా ఒకసారి
పెల్లుబికింది తెలంగాణలో
ఆత్మహత్యల పర్వం

టపా టపా పిట్టల్లా రాలిపోతున్నారు
తెలంగాణలో ప్రజలు
ఏ నాయకుడు ఏమి చేసినా
తృణప్రాయంగా ప్రాణాలర్పించేందుకు
జనాల పోటి పందాలిక్కడ
ఒకరి ఓదార్పు యాత్రనాపితే
యుద్దభేరి మోగిస్తారిక్కడ
ఒకరి నిరాహార దీక్షనడ్డుకొంటే
అగ్నిగోళం ఈ నేలంతా
ఏ నాయకుడు యే మాటన్న
సునామియే ఈ నేలంతా
ఓ నేత ఆత్మాహుతి యత్నం చేస్తే
పదిమంది ఆత్మహత్యలకు సై ఇక్కడ
ఇదదనికాదు నాయకులు ఏం చేసినా
ప్రజలకున్నది ఆత్మహత్యలే
ఇపుడు నాయకుడింట్లో దుఃఖానికి
దేశమంతా పొర్లి పొర్లి ఏడ్వాలిక్కడ

అంటున్నారెందరో
ఆత్మహత్యలు కావివి హత్యలని
అవునవునంటూ వత్తాసుపలుకుతూ
అవి రాజకీయ హత్యలే
ఇంకా ప్రభుత్వ హత్యలే
అంటూ రంకెలేస్తున్నారు మరికొందరు

కానీ ఇదంతా నిజమేనని
పొరపాటున నమ్మేవు మిత్రమా
ఇవి హత్యలన్నది నిజమే కానీ
శత్రువులు చేస్తున్న హత్యలు కావు
ఇదంతా మిత్రులనే ముసుగేసుకున్న
మానవమృగాల పనేనన్న
సత్యం గ్రహించుమా మిత్రమా

మరీ అంత పెద్ద అభాండమా
అంటావేమో!
ఆశ్చర్యపోకు
ఇది తెలంగాణ
గడీలు రాజ్యమేలిన తెలంగాణ
సాయుధపోరాటంలో
దెబ్బతిన్న పులిలాంటి తెలంగాణ
ఇక్కడేదైనా సాధ్యమే

మళ్ళా ఇంకొక సాయుధపోరాటం
మొదలయ్యేవరకూ
దీనికంతం లేదు
ఇకనైనా మేలుకో మిత్రమా
నిజం తెలుసుకో నేస్తమా

Advertisement

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.