January 31, 2010 at 11:50 am (Literature, People, Poetry, Society, Telangana, Telugu)
Tags: M. Bharath Bhushan, Telangana, Telugu
ఉద్యమానికి రాజీనామా లేదు
M. Bharath Bhushan
చెల్లని రాజీనామాలు
కిరాతక రాజకీయాలు కావివి,
ఆంధ్ర వలసవాదుల కుట్రలకు తలొగ్గిన
స్పీకర్ కుట్రనే ఇది ముమ్మాటికి.
“పనికిరాని రాజీనామాలిచ్చిన బోగస్ నాయకులని”
ముద్రవేసే లగడపాటీల కుతతంత్రాలనెండగట్టండి.
ఆత్మ హత్య చేసుకొన్న పిల్లల రాతల్లోని ప్రతి మాట
యముడికెలా అర్థమైననదీ మన నాయకుల రాజీనామాల్లో
ఒక్కమాటా స్పీకర్కు ఎందుకు అర్థం కానిదీ కనుక్కోండి.
ఆత్మహత్య తలపెట్టిన ప్రతి యువకుడెలా నెగ్గిందీ
నాయకుల ప్రతి పనికి వెయ్యి అడ్డంకులేందనడగండి.
రెండొందల యాభై ఆత్మహత్యలైనా
ఒక్క రాజీనామ నిలవకపోవడమేందో అడగండి.
తెలంగాణ నాయకుల రాజీనామాలు
ఒల్లెక్కల నాటకాలు కాదనీ ఊరూరా చెప్పండి!
Read the rest of this entry »
Leave a Comment
January 30, 2010 at 3:45 pm (Literature, Nation, People, Society, Telangana, Telugu)
Tags: 1969, Economy, Hyderabad, Industrialization, Telangana, Telugu gadda
Souce: Telugu gadda first edition. (9-11-1969)
బొంబాయి, కలకత్తాలతో హైదరాబాద్ పోటీ
తెలంగాణాలో పరిశ్రమల అభివృద్ధికి కారణాలు
ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు అంటే 1956 సంవత్సరానికి పూర్వమే తెలంగాణా ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాతిపదిక ఏర్పడింది. అంతకు పూర్వం, పారిశ్రామిక ట్రస్ట్ ఫండ్ ద్వారా 50 నుండి 70 శాతం ప్రభుత్వ వాటా ధనం లభిస్తూండడంవల్ల అనేక పరిశ్రమల స్థాపనకు అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహం బాగా లభించింది. 300 లక్షల వాటా ధనంతో సింగరేణి బొగ్గుల కంపెనీ, 146 లక్షల వాటా ధనంతో నిజాం చక్కెర ఫ్యాక్టరీ, 49.59 లక్షల వాటా ధనంతో హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్, 25.62 లక్షల వాటా విరాళంతో హైదరాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, 150.54 లక్షల చెల్లింపు వాటా ధనంతో ప్రొగాటూల్స్ కార్పొరేషన్, 72 లక్షల చెల్లింపు వాటా ధనంతో ఆజంజాహి మిల్సు ప్రభుత్వ కార్యనిర్వహణాధికారంలో నిర్వహింపబడుతున్న పరిశ్రమలు.
కాగితం, రేయాన్, రసాయనాలు, సిగరెట్లు, రేకు ఉత్పత్తులకు సంబంధించిన అనేక పరిశ్రమలను స్వల్ప వాటా ధనం పెట్టుబడులతో ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమానికి ముందుగానే, వీటిలోని అనేక పరిశ్రమలను ఆ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పెద్ద పరిశ్రమల స్థాపనకే ప్రాధాన్యం ఇచ్చినది. లఘు పరిశ్రమల, కుటీర పరిశ్రమల అభివృద్ధి అవసరాన్ని 1951-52 నుండే గుర్తించారు. తెలంగాణాలో ఉపాధి సౌకర్యాల కల్పనకు విశేషావకాశాలు ఉండడం దృష్ట్యా అప్పటినుండి లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. ప్రధమ పంచవర్ష ప్రణాళికాకాలంలో అంటే 1956వ సంవత్సరానికి పూర్వమే తెలంగాణా ప్రాంతంలో కుటీర పరిశ్రమల అభివృద్ధి నిమిత్తం పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్‌కు మూడు లక్షల రూపాయలు కేటాయించారు. Read the rest of this entry »
1 Comment
January 29, 2010 at 12:29 pm (Culture, Literature, Nation, People, Society, Telangana, Telugu)
Tags: Fazl Ali commission, Nation, People, Society, States Reorganisation commission Report, Telangana, Telugu, Telugu gadda
source : Telugu gadda first edition (9-11-1969)
పునాదులు కూలిన ఆంధ్రప్రదేశ్
విభజనే ఉభయ ప్రాంతాలకూ శ్రేయస్కరం
జి, సుధాకర్
ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాల కలయిక వల్ల ఏర్పడింది. ఈ విలీనీకరణ కొన్ని షరతులకు లోబడి జరిగింది. విలీనీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారిని మచ్చిక చేసుకోవడానికి ఆంధ్ర నాయకులే ఈ షరతులను సూచించారు. రక్షణలనేవి తెలంగాణా ప్రజలు బిచ్చమెత్తి తెచ్చుకున్నవి కావు. తమను నమ్మని భాగస్వాములకు తమ పెద్దమనిషి నమ్మకం కలిగించడానికి తాపత్రయపడ్డ ఆంధ్ర నాయకులే వాటిని తమంత తాముగా ఇచ్చారు, సరే. షరతులను పాటించకపోతే మన రాష్ట్రం మనకేఉంటుంది గదా అనే భరోసాతో తెలంగాణా నాయకులు అంగీకరించారు. ఇది చారిత్రక సత్యం. అంటే ఆంధ్రప్రదేశ్ బేషరతుగా ఏర్పడిన రాష్ట్రం కాదు. “పెద్దమనుష్యుల ఒప్పందం” దానికి పునాది. ఈ పునాది ఇప్పుడు కూలిపోయింది. ఇక ఈ రాష్ట్ర విభజన తప్పదు.
ఆంధ్ర నాయకులు ఇప్పుడైనా పెద్దమనుష్యులుగా వ్యవహరిస్తే గతంలో చేసిన పాపాలు మరుగున పడతాయి. లేకపోతే పాపాలు పెరిగు పెరిగి వారి వనాశానికే దారితీస్తాయి. ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర విర్మాణానికి అంగీకరించడం ఆంధ్రకే క్షేమం. కాదంటే చేజేతులా వినాశాన్ని తెచ్చిపెట్టుకున్న వారవుతారు. చరిత్ర వారిని క్షమించదు. వారి భావి తరాలే వారిని తమ శత్రువులుగా తూలనాడుతాయి.
చారిత్రక సత్యం అన్నానుకదూ! అది ఫజల్ అలీ కమిషన్ నివేదికలో దాగిఉంది. ఆ నివేదిక పుటలు తిరగేస్తే ఆంధ్ర నాయకుల బండారం అంతా బయట పడుతుంది. తమకు నాయకులుగా చలామణీవుతున్నవారు ఎంతటి గుండెలు తీసిన దుండగులో ఆంధ్ర సోదరులకు అర్ధమవుతుంది. ఈ నాయకామ్మణ్ణ్యుల కల్లబొల్లి కబుర్లకు వారిక మోసపోరు. ఈ నవేదికలోని కొన్ని పేరాలను యధాతధంగా ఇక్కడ ఇస్తున్నను. మొదట ఈ నివేదిక అందజేసినప్పుడు ఈ కమీషన్ జారీ చేసిన పత్రికా ప్రకటన ఇస్తాను. అందులో ఇలా ఉంది. Read the rest of this entry »
Leave a Comment
January 25, 2010 at 5:50 pm (Culture, Literature, Nation, People, Society, Telangana, Telugu)
Tags: Literature, People, Telangana, Telugu, Telugu gadda
ఈ వ్యాసం 1969లో తెలుగుగడ్డ పత్రిక ప్రారంభ సంచిక (9-11-1969)లో ప్రచురితమైనది.
విషపురుగుల విద్రోహానికి ఆంధ్ర బలి కారాదు!
సమైక్య పోరాటానికి సన్నద్ధం కావాలి!
ఆంధ్ర శ్రీ
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో దాదాపు ఒక శతాబ్దం వరకూ ఆంధ్రజాతి అరవల పెత్తనం క్రింద అణగి పడిఉండవలసి వచ్చింది. ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ తమిళులే ఆధిక్యత వహిస్తూ ఆంధ్రులను అణగద్రొక్కారు. పారిశ్రామికంగానే కాక వ్యవసాయికంగా కూడా ఆంధ్ర ప్రాంతం ఎంతగానో వెనుకబడిపోయింది. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రుల పరిస్థితి అమెరికా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో శ్వేతజాతి పెత్తనం క్రింద గల నీగ్రోల పరిస్థితిలాగే ఉండేది. ఇది చారిత్రిక సత్యం.
గతాల జ్ఞాపకాలు
ఈ దుస్థితినుండి బయటపడడానికి ఆనాడు ఆంధ్రులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆందోళన ప్రారంభించారు. సభలూ సమావేశాలూ జరిగాయి. ఊరేగింపులూ, ప్రదర్శనలూ జరిగాయి. ఢిల్లీకి విజ్ఞాపన పత్రాలు వెళ్ళాయి.
చివరికి శ్రీ పొట్టి శ్రీరాములు అత్మార్పణ చేయవలసి వచ్చింది. ప్రజలు రెచ్చిపోయారు. నెల్లూరు, రాజమండ్రి, తాడేపల్లిగూడెం మొదలైన చోట్ల అల్లర్లు చెలరేగాయి. పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజానీకం ఆగ్రహావేశాలతో కదిలింది. కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలనన్నిటినీ స్తంభింపజేసింది. కేంద్రానికి దిక్కు తోచలేదు. గత్యంతరంలేక వివాదరహిత ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అప్పటి ప్రధాని నెహ్రూ అంగీకరించారు. Read the rest of this entry »
Leave a Comment
January 24, 2010 at 12:37 pm (Culture, Literature, Nation, People, Society, Telangana, Telugu)
Tags: Anita Mamidi, Culture, People, Society, Telangana, Telugu
ఒక్క సారి భగ్గుమన్న ప్రత్యేక రాష్ట్ర నినాదాలేమిటి?
అనిత
తెలంగాణా ఉత్సవ్ కమిటీ
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ప్రారంభం కాగానే, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మళ్ళా ఒకసారి తెరపైకి వచ్చినాయి. ఏ కారణాల వల్లనైతేనేమి మొదటిసారి ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది.
దీంతో రాష్ట్రప్రభుత్వం ముందున్న రెండు జటిల సమస్యలు పరిష్కారమైనాయి. ఒకటి కే సీ ఆర్ దీక్ష విరమించడం, రెండు తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించిన రోశయ్య గారు చెప్పిన అసాంఘిక శక్తుల ఆట కట్టించడం. అయితే ప్రతిసారీ ఎలక్షన్స్ లో చక్కగా ఉపయోగపడే బంగారు గుడ్డు పెట్టే బాతులాంటి తెలంగాణా సమస్యను పరిష్కరించాల్సిన అవసరమొచ్చింది. అంతే, అన్ని పార్టీల నేతలూ ఒక్కసారి ఉకిక్కి పడ్డారు. Read the rest of this entry »
Leave a Comment
January 23, 2010 at 9:06 am (Culture, Kaloji, Literature, Nation, People, Poetry, Society, Telangana, Telugu)
Tags: Kaloji, People, Poetry, Society, Telangana, Telugu
ఇంకెన్నాళ్ళు?
కాళోజీ
తెలుగుగడ్డ రెండవ సంచిక (16-09-1969) లో ముద్రితము
నవ యుగంబున నాజీవృత్తుల
నగ్ననృత్యమింకెన్నాళ్ళు?
పోలీసు అండను దౌర్జన్యాలు
పోషణబొందే దెన్నాళ్ళు?
దమననీతితో దౌర్జన్యాలకు
దాగిలిమూతలు ఎన్నాళ్ళు?
కంచెయే చేను మేయుచుండగా
కాంచకుండుటింకెన్నాళ్ళు?
దొంగలుదొంగలు ఊళ్ళుపంచుకొని
దొరలై వెలిగే దెన్నాళ్ళు?
బాధలుపెట్టి పలుకనీయని
పాపులభయ మింకెన్నాళ్ళు?
హింస పాపమని యెంచు దేశమున
హిట్లరత్వ మింకెన్నాళ్ళు? Read the rest of this entry »
Leave a Comment
January 23, 2010 at 5:05 am (Culture, Kaloji, Literature, Nation, People, Poetry, Society, Telangana, Telugu)
Tags: Kaloji, Literature, People, Poetry, Society, Telangana, Telugu, Telugugadda
ఉద్యమం ఆగబోదు
కాళోజీ
వరమిచ్చిన కేంద్ర శివుని
శిరము పైన మోపినాడు
ముఖ్యమంత్రి భస్మాసురుడు
ముచ్చటగా తన చేతులు
మోహిని అవతారమెత్తి
సాహసించు పాటివనరు
కానరాక తల్లడిల్లు
కాడెద్దుల బలగమంత
పార్టే దేశము అనుకొను
పాటిది విజ్ఞత అంతయు
ముఠాదే రాజ్యమ్మను
శఠము గూర్చు ఫలితమ్మిది
‘పార్టీవ్రత్యము పాపము
పండిన పరిణామమిద్ది
“కాడెద్దుల” పెత్తనాల
కాలము మూడగనున్నది
‘ప్రత్యేక తెలంగాణము
ప్రాప్తి : ఒక్కటే ఒక్కటి
తెలంగాణ ప్రజలకోర్కె
తెలంగాణ ప్రత్యేకత
‘ప్రత్యేక తెలంగాణ
ప్రాప్తించే దాక ప్రజల
ఉద్యమం ఆగబోదు
ఉవ్వెత్తున లేచిసాగు
కోటిన్నర మేటిప్రజల
గొంతొక్కటి; గొడవొక్కటి
తెలంగాణ వెలసి నిలిచి
ఫలించాలె భారతాన
భారతమాతా కీ జై
తెలంగాణ జిందాబాద్
తెలుగుగడ్డ ప్రారంభ సంచిక (09-11-1969) లో ముద్రితము
Leave a Comment
January 19, 2010 at 5:19 pm (Culture, Kaloji, Literature, People, Society, Telangana, Telugu)
Tags: Daasaradhi, Kaloji, Literature, Suravaram Pratapa Reddi, Telangana, Telugu
తెలంగాణా ఆధునిక సాహిత్య ముఖద్వారం
శ్రీ దాశరథి
[వట్టికోట అళ్వారుస్వామి గారి 'తెలంగాణం' (1956) పుస్తకంలో ముద్రితం]
మనం జీవితంలో ఏమేం చూచామో, జీవితంలో నుంచి ఏయే అనుభవాలు పొందామో, మనందరికీ ఆసక్తిని కలిగించే ఏయే విషయాలను గూర్చి ఏమని ఆలోచించామో, వాటితో ఎట్లా ప్రభావితులమైనామో- అదంతా రికార్డు చేస్తే సాహిత్యం అవుతుంది. శబ్దాల్లో శతాబ్దాల, సహస్రాబాల పొడుగు మానవ జీవితాన్ని ప్రకటించడమే స్థూలంగా సాహిత్యం.
జీవితంతో ఇంత దగ్గరి సంబంధం గల సాహిత్యాన్ని జీవితపు మాలిన్యం అంటకుండా దూరంగా ఊహాలోకంలో స్నానమాడించి, పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించే సాహిత్యకారులు కొందరు అన్ని కాలాల్లో ఉన్నారు. వారితో మనకు ప్రమేయం లేదు. కాడలు, తీగలు, కొమ్మలు, వేళ్ళు, నేల- ఏమీ లేకుండానే వికసించే ఆకాశ కుసుమం వంటి సాహిత్యం మనకు ఉపాధేయం కాదు.
ఉదాత్తమైన సాహిత్యంలో ఆధునికమని, ప్రాచీనమని ఏమీ ఉండదు. ఇవి కేవలం కాలాన్ని నిర్ణయించుకోడానికి ఉపయోగపడే శబ్దాలు. వెనుకటి సాహిత్యాన్ని ప్రాచీనమనీ, ఈనాటి సాహిత్యాన్ని ఆధునికమనీ అనుకోవాలి. ప్రతి ఆధునికుడూ నవ్యుడు కానక్కరలేదు. పురాతన రీతిలో వ్రాసే ఈనాటె రచయిత కూడా ఆధునికుడే. అతడు నవ్యుడు కాకపోవచ్చును. Read the rest of this entry »
1 Comment
January 19, 2010 at 3:28 pm (Culture, Kaloji, Literature, Nation, People, Poetry, Society, song, Telangana, Telugu, Women)
Tags: Kaloji, Literature, People, Poetry, Society, Telangana, Telugu
చెడిన తెలుగు తనం
కాళోజీ
నిజాం నవాబు పాలన క్రింద చెడిన తెలుగు తనం
గడచిన పదిహేనేండ్లలో దిద్దబడెను చాలావరకు
ఇప్పుడు తెలంగాణ అంతట ఆంధ్రత్వం ఎటుచూచిన
‘చా’, టీ అయి మసులుతాంది, ‘సడకు’ రోడ్డై సాగుతున్నది
‘అదాలతు’ ‘కోర్టా’యెను, ‘ముల్జీం’ ముద్దాయాయెను
షక్కర షుగరైపోయెను ఉప్పు సాల్టుగా మారెను
వచ్చిండని పోయిండని అంటలేడు ఎవడిప్పుడు
వచ్చాడని చచ్చాడని అంటున్నరు చచ్చినట్లు
‘పసుపుకుంకుమలు ఇప్పుడే ‘పేరంటాలావుచున్నవి
ఆంధ్రుల సంస్కృతి సభ్యత తెలంగాణ కబ్బుతాంది
రెండున్నర జిల్లాల యాసంతట వెలుస్తాంది
తెలంగాణ బంజరంత కృష్ణ నిండి పొర్లుతాంది
తెలంగాణ జంగలంత ‘గోర’ గంతులేస్తాంది
ఎంతలోన తెలంగాణ ఆంధ్రతనం నేర్చుకుంది
భావ సమైక్యత ఎంతలో అందరినీ పోనినాది
పెద్దమనిషి ఒప్పందం ఎంతలో ఫలమిచ్చినాది Read the rest of this entry »
Leave a Comment
January 17, 2010 at 2:45 pm (Culture, Kaloji, Literature, Nation, People, Society, Telangana)
Tags: Anita Mamidi, Kaloji, Literature, People, Society, Telangana, Telugu
కాళోజీ స్పూర్తితో కర్తవ్యాన్ని గుర్తిద్దాం
అనిత, తెలంగాణ ఉత్సవ్ కమిటీ
కన్నడులు మహారాష్ట్రులు తుర్కీ
అన్నయ్యలు తరతరాలేలినది.
గుజరాతీ, మార్వాడీ, పారిసీ
గుజ్జన గూళ్ళు అనుభవించినది
కాబూలీ ఈరాని భాయీలకు
కనువిప్పుగ వెలిగిన విధమిది.
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది.
ముంచే యత్నము చేస్తే తీరము
మునుగును తానే తీరము తప్పక (కాళోజి)
ఎవరు ఎంత కాలం పాలించినా, తెలంగాణాగడ్డ ఎన్నిరకాలుగా దోపిడీకి గురైనా,ఎన్నో సార్లు తెలంగాణా ప్రజలు దోపెడీ వ్యతిరేక ఉద్యమాలు చేసి విజయం సాధించినా మునుపెన్నడూ లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ‘మమ్మల్ని దోచుకున్నది చాలు ఇంక ఎల్లిపొండంటె, ‘మేము మిమ్మల్నొదలం మీతో కలిసే ఉంటాం, దోపిడీ ఇలానే కొనసాగిస్తాం’ అంటూ కనీ వినీ ఎరుగని రీతిలో “అన్యాయ పోరాటం” చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్ మద్దతు పలకడం, తెలంగాణకిచ్చిన వాగ్దానాలు పదేపదే వెనక్కి తీసుకోడము పెద్దగా ఆశ్చర్యంకలిగించాల్సిన విషయం కాదు. ఎవరో దయదలచి ఉత్తపుణ్యానికి బర్త్ డే కానుకగనైనా తెలంగాణను ఇవ్వకపోరా అనుకొంటే ఇట్లనే ఉంటది. Read the rest of this entry »
Leave a Comment
« Older entries