ఖాళీలను పూరించడమే సాహిత్యం పని – బాలగోపాల్ తో ఇంటర్వ్యూ:కె శ్రీనివాస్

ఖాళీలను పూరించడమే సాహిత్యం పని

మార్క్సిజంపై అసంతృప్తితో తాను మొదలుపెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ, తనకు సంతృప్తినిచ్చే ప్రాపంచిక దృక్పధం ఏర్పడిందనీ బాలగోపాల్ ఈ ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ఆ దృక్పధం ఏమిటో సాహిత్యాంశాల అన్వయంతో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఎనిమిదేండ్ల కిందట జరిగిన ఈ సంభాషణ- బహుశా బాలగోపాల్ ఇచ్చిన చివరి పూర్తి సాహిత్య ఇంటర్వ్యూ…….

బాలగోపాల్ తో  ఇంటర్వ్యూ:కె శ్రీనివాస్

చరిత్ర మనిషి మార్క్సిజం- అన్న మీ సుప్రసిద్ధ వ్యాసం (అరుణతార, సెప్టెంబర్ 1993) ‘రాగో’ అన్న నవలకు సమీక్షగా రాశారు. ప్రధానంగా సాహిత్య విమర్శ వ్యాసంగా వచ్చిన ఆ రచనలో రాజకీయ అంశే సంచలనాన్ని, వివాదాన్ని సృష్టించింది తప్ప, దానిలోని సాహిత్య చర్చనీయాంశాలను ఎవరూ పట్టించుకోలేదు. మీరు ప్రతిపాదించిన లేదా చర్చించిన సాహిత్య అంశాలు కూడా ‘రాజకీయా అంశాలంత వివాదాస్పదమైనవి. ప్రతిస్పందనలోని ఆ విశేషాంశాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు?

అది సమీక్షగా రాసింది కాదు. ముందుమాటగా రాసింది. రచయిత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైన రచనను ముందుమాటగా వేయడం భావ్యం కాదనిపించి, ‘రాగో’కు ముందుమాటగా కాకుండా విడిగా వ్యాసంగా అచ్చు వేయదలచుకుంటే వేయమని చెప్పాను. అందువల్ల అది
‘అరుణతారాలో వ్యాసంగా అచ్చయ్యింది. స్పందన మాటకొస్తే, రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో. కానీ తమ రాజకీయ విశ్వాసాలపైన దాడిగా దానిని భావించి స్పందించిన వారే ఎక్కువ కాబట్టి చర్చ ఆ విధంగా జరిందనుకోవాలేమో. అయినా ఆ వ్యాసం నా అభిప్రాయాల సమగ్ర వ్యక్తీకరణ కాదు. అప్పటికి దాదాపు మూడేళ్ళుగా నా తాత్విక విశ్వాసంగా భావిస్తూ వచ్చిన మార్క్సిసం
పట్ల అసంత్రుప్తిగా ఉండింది. దానికి సమాధానం చెప్పగలగడం సంగతి అటుంచి, ఆ అసంతృప్తిని స్పష్టంగా నాకు నేను వివరించుకోలేకపోవడం వల్ల రాయడమే మానేసాను (పౌరహక్కుల రిపోర్టులు తప్ప). ఆ దశలో నేను చేసిన మొదటి రచన ఆ వ్యాసం. ముందుమాటకుండే పరిమితులే కాక ఈ పరిమితి కూడా దానికి ఉంది. అందువల్ల ఆ వ్యాసంలోని అభిప్రాయాలను వివరించే పద్ధతిలో కాకుండా మీ ప్రశ్నలకు విడిగానే జవాబ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆనాడు నేను మొదలు పెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ నాకు సంతృప్తి ఇచ్చే ప్రాపంచిక దృక్పధం నాకిప్పుడుందనీ అనుకుంటున్నాను. Read the rest of this entry »

ఉద్వేగాల మాటున వాస్తవాలు- Balagopal

ఉద్వేగాల మాటున వాస్తవాలు

-కె.బాలగోపాల్‌

దేశం చాలా ఆవేశంగా ఉంది. చాలా అసహనంగానూ ఉంది. ‘ఇంక ఓర్చుకోలేం’ అంటున్నారు. ‘ఇప్పటికి జరిగిన నష్టం చాలూ అంటున్నారు. ‘ఇంక ఉదాసీనంగా ఉండడానికి వీలు లేదూ అంటున్నారు. కఠినచర్యలకు సమయం ఆసన్నం అయిందీ అంటున్నారు. ఎప్పుడూ ఏ సామాజిక సమస్యల గురించీమాట్లాడని వర్గాల వారు ఈ మాటలు అంటున్నారు.

ప్రభుత్వం ఏం చేయాలని? ఏం చేసి ఉండాలని? ఏం చేసి ఉంటే కిందటి వారం ముంబైలో జరిగిన దాడి  ఆగి ఉండేదని? అనుమానం మీద ఎవరినయినా కాల్చి పారేయొచ్చునన్న చట్టం పోలీసుల చేతిలో ఉంటే ఆగేదా? (అటువంటి చట్టం ఉండాలని ఇప్పుడు చాలామంది మనస్సులలో ఉందనుకుంటాను). మంబై పోలీసులకు ఎవరి మీదా అనుమానం రాలేదు మరి. అటువంటప్పుడు అట్లాంటి చట్టం ఉన్నా కూడ ఆగేది కాదు కదా? పర్యవేక్షణ వ్యవస్థ వైఫల్యం అనీ అంటున్నారు. జరగకూడనిది జరిగినట్లయితే అది జరగకుండ చూసే బాధ్యతగలవారు విఫలమనట్లేననే తర్కం ప్రకారం ఇది సత్యమే గానీ, ఆ దాడి ఏ విధంగా జరిగిందో తెలిస్తే తప్ప పోలీసు సమాచార వ్యవస్థ దానిని పసిగట్ట వలసి ఉండిందా, పసిగట్టకపోవడంలో నిర్లక్ష్యం వహించిందా అనేది తేల్చలేం తేల్చకుండ పోలీసు పర్యవేక్షణ, నిఘా పెంచాలన్న డిమాండుకు పెద్దగా అర్ధం లేకపోగా అది కొత్త సమస్యలు తెచ్చి పెట్టగలదు. Read the rest of this entry »

భయాంధ్రప్రదేశ్‌! – బాలగోపాల్‌

భయాంధ్రప్రదేశ్‌!

-కె.బాలగోపాల్‌
భయం నుంచి బయటపడి ధైర్యంగా ఆత్మస్థైర్యంతో మాట్లాడేటటువంటి ఆ ప్రజాస్వామిక విలువను కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యమైన పనైపోయింది ఇవ్వాళ మన ఆంధ్రప్రదేశ్‌లో. ఆత్మ స్థైర్యం, ధైర్యం, నిర్భీతి, ఈ ప్రజాస్వామిక విలువలు లేకపోతే హక్కులసాధన అయ్యేపనికాదు, ఇవి లేకపోతే మనం హక్కుల కోసం కొట్లాడట మనేది సాధ్యమయ్యేపనికాదు. అది చెప్పటం అవసరమని నేననుకుంటున్నాను.

సమాజం భయపడుతూ ఉంటే, నిజం చెప్పటానికి భయపడుతూంటే, అబద్ధాన్ని అబద్ధం అనడానికి భయపడు తూ ఉంటే ఏ హక్కులు సాధించుకుంటాం? దళితులు గానివ్వండి, కార్మికులు గానివ్వండి, ఉద్యోగులు గానివ్వండి, ఎవరైనా గానివ్వండి, సత్యాన్ని సత్యం అనగలగాల, అసత్యాన్ని అసత్యం అనగలగాల, నాకిది న్యాయమూ అని నిర్భయంగా చెప్పగలగాల.

అది సాధ్యం గాని చోట హక్కులు అనే మాటకు అర్థం ఉండదు. ఈ రాష్ట్రాన్ని భయం ఏలుతూ ఉంది. ఆ భయం నుంచి ఈ రాష్ట్రం బయటపడలేదు అని – పడింది అని ఒకవేళ అనుకున్నా ఎప్పుడైనా- రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తా వున్నాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి తన కుర్చీలో కూర్చోలేడు. ధైర్యం చాలడం లేదు.. తన తోటి మంత్రులు పని చెయ్యకపోతే, ఎందుకు పని చేయడం లేదు అని వాళ్ళనడగకుండా, ‘ఏం? మంత్రి ప్రతిరోజూ సంతకం చేయాలా సెక్రటేరియట్‌లో కూర్చోని?’ అని వాళ్ళ తరఫున ఆయనే జవాబు చెప్తున్నాడు. అడగటానికి ఆయనకు భయం. రాజశేఖరరెడ్డి చనిపోయినాక రాష్ట్రంలో ఎవరో అన్నారంట, ప్రతి పెద్ద ఆస్పత్రిలోను కూడ రోజుకో ఇరవై అయిదు ముప్పై అయిదు మంది గుండెపోటుతో వస్తుంటారు, పోతుంటారు, కొందరు మళ్ళీ ఇంటికి పోతుంటారు అని.

ఇవ్వన్నీ గూడా ఆ చావుకు సంబంధించిన మరణాలే అని బుకాయించారని ఒక ఆంగ్ల పత్రికలో ఆంగ్ల మీడియా చెప్పవలసివచ్చింది. మనకు« ధైర్యం చాలడం లేదు. ఇక్కడ మీడియాకు ధైర్యం చాలడం లేదు. ఇక్కడ వ్యాఖ్యాతలకు ధైర్యం చాలడంలేదు. అన్నిటినీ తీవ్రంగా విమర్శించే వ్యాఖ్యాతలుగా టివిలో కనిపించినటువంటి మహానుభావులు, పేర్లు చెప్పొద్దు, బాగుండదు, వాళ్ళకి సాధ్యం కాదు. Read the rest of this entry »

రాజకీయ పార్టీలు తమ బాధ్యత నేర్చేదెప్పుడు?

అసలే గందరగోళం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలియదు. తెలుగుదేశం చెప్పేదీ, టీఅరెస్ చెప్పేదీ నమ్మొద్దని వైఎస్సార్ చెప్తడు. వైఎస్సార్ చెప్పేది నమ్మొద్దని కేసీఅర్, చంద్రబాబు చెప్తరు. వీళ్ళెవరినీ నమ్మొద్దని చిరంజీవి, జేపి చెప్తరు.

ఎన్ని వాగ్దానాలో! వింటే కళ్ళు తిరిగిపోతయి. ప్రతిసారి ఇట్ల వాగ్దానాలు చేస్తనే ఉంటరు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చకపోగా వాటికి విరుద్ధంగా నడుచుకుంటారు. ప్రతిపక్షంలో కూచున్నవారు వాటిగురుంచి అడగరు. ఇలాంటి వాగ్దానాలు మళ్ళా మళ్ళా చేస్తనే ఉన్నా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉంటాయి. సమస్యలలో పుట్టి సమస్యలతోనే చస్తున్న సామాన్యునికి ఇటువంటి రాజకీయ నాయకులను ప్రశ్నించేంత శక్తెక్కడిది? ఎప్పుడైనా ధైర్యం చేసి అక్కడక్కడా ఎదురు తిరిగినా న్యాయం జరగడం శూన్యం. దానికి నిదర్శనాలు ఎన్నెన్నో. ఒక పోలెపల్లి, ఒక తెలంగాణ, ఒక పోలవరం, ఒక పులిచింతల ఒక పోతిరెడ్డిపాడు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలూ . ఇంకా ఎన్నో. Read the rest of this entry »

పాలకుల అలసత్వం కాదా!

సతీష్‌ కుమార్‌ గారి ‘దెబ్బతిన్నది పులి’ వివిధ విషయాల గురించి ఆలోచిం చాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. రణపెంకి (ఉగ్రవాదులు) ఉన్న ఇంట్లో (వాడు వాళ్ళ సంబంధీకుడేనా) ఉన్న వాళ్లెవరికీ మాట్లాడే హక్కు గాని బతికే హక్కు కానీ లేదనే అనుకుందాం. అయితే ఈ ఉగ్రవాదులు యథేచ్ఛగా ఏండ్లకొద్ది మన దేశంలో ఎలా తిష్టవేసుకున్నారో? మనం పోరాడాల్సింది ఉగ్రవాదులతో మాత్రమేనా?
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కాపాడుకొనే మనింటి శక్తుల ను కుట్రలను వెనకేసు కు రావల్సిందేనా? పాకిస్థాన్‌ దుష్ట వ్యూహాలు ఉగ్రవాద చర్యలను ఎవరూ సమర్ధించడం లేదు.

బాలగోపాల్‌ కూడా దేశద్రోహిని కీర్తించమనలేదు. అయితే ప్రతి దానికి పొరుగువాడే కారణమని ఎంతకాలం సమస్యలను దాచిపెడతాం? పాకిస్థాన్‌ నిందలతోనే దేశభక్తి సరిపెడదామా? అమెరికా యుద్ధోన్మాదాన్ని మన భుజాన వేసుకొని, నిష్కారణంగా సద్దాంని ఉరితీసిన అమెరికా రాక్షసత్వాన్ని మనం కొనసాగించాల్సిందేనా? మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ త్యాగాలకు కుక్కల బాషలో అర్థం చెప్పిన
కామ్రేడ్‌ అచ్యుతానందన్‌లు, హేమంత్‌ కర్కరేపై కక్ష కట్టిన మోడీ బృందాలు, దంతేవాడల సల్వాజుడుం పేరున రావణ కాష్ఠం రగిల్చిన మన్మోహనులు, కోట్ల సంచులకు అమ్ముడుపోయిన ఎంపీలు దేశభద్రతను గురించి మాట్లాడితే ప్రజలు సిగ్గుతో తలవంచుకొంటున్నారు. ఎన్నికల కాలం దేశభక్తి వట్టిమాటలు కట్టిపెట్టమంటున్నారు.

పరామర్శించేందుకొచ్చిన మంత్రులను పోరా పో అని చీదరించుకుంటున్నారు. ఇంకెంతకాలం బిక్కు బిక్కుమనుకుంట ఇంటికి తిరిగొచ్చేంతవరకు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో చచ్చారో తెలువని రాక్షస పాలనను ప్రశ్నిస్తున్నారేది మరవొద్దు. పాకిస్థాన్‌ మీద యుద్ధం చేస్తే చెయ్యండి, గోకుల్‌ చాట్‌ లుంబిని పార్కులో చార్మినార్‌ మక్కా మసీ దు అజ్మీర్‌ జైపూర్‌ మొదలైన ఎన్నో ప్రాంతాల్లో
ప్రజానీకం చస్తే స్పందించని ఇంతవరకు నేరస్థులను శిక్షించని ఘనత వహించిన ప్రభుత్వాలు తాజ్‌ హోటల్‌ పైన జరిగిన ఎన్నికల ముందు ఫైవ్‌ స్టార్‌ టెర్రరిజానికి మేల్కోనడమే కాదు సరాసరిన అమెరికా భావజాలంతో యుద్ధాన్నే ప్రకటించనీ! ముంబై ఘటనకు మించిన అమానవీయ సంఘటనలు కోకొల్లలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం.

కాని అన్నిటికి మూలకారణం మన రాజకీయ నాయకుల అలసత్వం ఇంకా స్వార్థ ప్రయోజనాలే కాదా? మరి దేనికీ లేనిది ముంబై ఘటన పైననే ఇంత నిరసన ఎందుకు అనేది చాలా సహజంగా ఉద్భవించే ప్రశ్న. ఎందుకంటే స్టార్‌ హోటళ్ళపైన జరిగితే అది భారత జాతిపై జరిగినట్లు, దేశ పరువు బలైపోయినట్లు. అదే సామాన్యుడిపై జరిగితే దాన్ని పట్టించుకోవల్సిన అవసరమే లేదు. రెండ్రోజుల్లో అందరూ దాన్ని మర్చిపోతారు.
ఒక గోకు ల్‌ చాట్‌ ఘటన గురించి మాట్లాడొద్దు. దేని గురించి మాట్లాడొద్దు. పాకిస్థాన్‌ గురించి మాట్లాడాలి. ఉన్న మాటంటే ఉలుకెందుకు?

-అనిత